రోగనిర్ధారణ పద్దతుల అమలు పై పర్యవేక్షణ

రోగనిర్ధారణ పద్దతుల అమలు పై పర్యవేక్షణ

 విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్  ఆధ్వర్యంలో  జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం బుధవారం  కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ లో నిర్వహించారు.     ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ , జిల్లాలో గర్భధారణ పూర్వ , ప్రసవ పూర్వ రోగనిర్ధారణ పద్ధతుల (లింగ ఎంపిక నిషేధం) చట్టం, 1994 , మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ , ఎంపీపీ చట్టం అమలు పరిస్థితి, సంబంధిత వైద్య సంస్థల పర్యవేక్షణ, చట్టబద్ధ నిబంధనల అమలు, రికార్డు నిర్వహణ, తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ముఖ్యంగా ఆడ శిశు సంరక్షణ, లింగ నిర్ధారణ నిషేధం, గర్భస్థ శిశువు లింగ వివక్ష నివారణ, సురక్షిత గర్భస్రావ సేవలు, మహిళల ఆరోగ్య హక్కుల పరిరక్షణ, చట్టవ్యతిరేక వైద్యచర్యల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించారు.  స్కానింగ్ కేంద్రాలలో తప్పనిసరి డిస్‌ప్లే బోర్డులు, రిజిస్ట్రేషన్ ధృవపత్రాల ప్రదర్శన, సంబంధిత పరికరాల చట్టబద్ధ వినియోగం, అనుమతి లేకుండా సేవలు అందించరాదు, చట్టవ్యతిరేక లింగ నిర్ధారణ ప్రకటనలు , సేవలు పూర్తిగా నిషేధం అనే అంశాలపై సమీక్ష నిర్వహించారు.  గర్భస్రావ సేవలు అనుమతి పొందిన సంస్థలలోనే, అర్హత కలిగిన వైద్యులచే, చట్టబద్ధ ప్రమాణాల ప్రకారం మాత్రమే నిర్వహించాలని సమావేశంలో స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్య భద్రత, గోప్యత,  నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎటువంటి రాజీ ఉండరాదని తెలిపారు.     ఈ సందర్భంగా డాక్టర్ జగదీశ్వర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రీజినల్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, లింగ నిర్ధారణ, అనధికారిక గర్భస్రావాలు, రికార్డు లోపాలు వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత శాఖలు, పర్యవేక్షణ బృందాలు, మరియు వైద్య అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ చట్టాల అమలును కచ్చితంగా పర్యవేక్షించాలని అన్నారు. జిల్లా వైద్య  ఆరోగ్య అధికారి డా. బి. రవి రాథోడ్ మాట్లాడుతూ, జిల్లాలో ఆడ శిశు రక్షణ, మహిళల ఆరోగ్య హక్కుల పరిరక్షణ, మరియు చట్టబద్ధ వైద్య సేవల ప్రోత్సాహం కోసం వైద్యశాఖ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ సారంగం, డాక్టర్ నాగేశ్వర రావు, CWC చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి,  డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్  అరుణగైనకాలజిస్ట్,  సబిత, గవర్నమెంట్ ప్లీడర్ నాగేశ్వర్, కే వి రాజు, హెచ్‌ఈ, మానోహర్, లోక్య, కమలాకర్ డిసిపిఓ, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags: