తెలంగాణ ఉద్యమకారుల మండల ఫోరం ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల మండల ఫోరం ఎన్నిక

విశ్వంభర, అనంతగిరి:  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నూతన ఎన్నిక జరిగింది. మండల అధ్యక్షుడిగా ధారావత్ సైదులు, ఉపాధ్యక్షులుగా బచ్చు రాజ్యం, ప్రధాన కార్యదర్శిగా చిప్పల సుధాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు గుండపంగు రమేష్ మాట్లాడుతూ, నూతన పోరం తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు,ఉద్యమకాల సమయంలో జైలు జీవితం అనుభవించిన వారికి మద్దతుగా నిలవాలన్నారు.అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులందరినీ ఐక్యం చేసే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం నూతన అధ్యక్షుడు ధారావత్ సైదులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రతి ఉద్యమకారుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనపై బాధ్యతను అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల పోరాం నాయకులు ఏనుగుల యల్లేశ్వరరావు,కోదాడ మండలం అధ్యక్షులు కోళ్లూరి వెంకటేశ్వర్లు,తోటపల్లి నాగరాజు,కుడుముల రాంబాబు,గుండప్పంగు రవి కుడుముల శివ,రజిని తదితరులు పాల్గొన్నారు.

Tags: