ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం

ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం

విశ్వంభర, అనంతగిరి: శుభ్రత వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని మండల పరిధిలోని పాలవరం గ్రామ సర్పంచ్ మట్టపల్లి నరేష్ అన్నారు. మంగళవారం గ్రామంలోని అంగనవాడి కేంద్రంలో బుధవారం ఆరోగ్య లక్ష్మి కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నారుల పోషణపై ప్రత్యేకంగా చర్చించారు.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్, సర్పంచ్ నరేష్  మాట్లాడుతూ , అంగనవాడి కేంద్రంలో అందిస్తున్న పోషకాహార నాణ్యత, సమయానికి పంపిణీ, శుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అధికారులు గర్భిణీలు,బాలింతలు నిరంతరం అంగనవాడి సేవలను వినియోగించుకోవాలని సూచిస్తూ, పిల్లల ఆరోగ్యం మరియు పోషణపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో అంగనవాడి టీచర్ సైదమ్మ, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: