ఉప్పలపహాడ్ లో ఎలుగుబంటి సంచారం
On
విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం ఉప్పలపహాడ్ గ్రామంలో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో వెలుగుబంటి కలకలం రేపింది. ఏనుగు రామ్ రెడ్డి వ్యవసాయ బావివద్ద కుంటలో గ్రామస్తులకు ఎలుగుబంటి కనిపించిందని ఎలుగుబంటి జనాలను చూసి పోతిరెడ్డిపల్లి గ్రామం వైపు వెళ్లిపోయినట్లుగా చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు కలిగిన రైతులు తెలిపారు. ఆ ప్రాంత రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని తెలియపరిచినామని చెప్పారు.



