మూఢ నమ్మకాలు వద్దు
- చిర్ర యాకాంతం గౌడ్
విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మండలం కొత్తూరు గ్రామంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఐదవ రోజు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త, విద్యావేత్త చిర్ర యాకాంతం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చదువు లేకపోవడం వల్ల వ్యక్తి మూఢత్వానికి లోనవుతాడని, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో మంత్రాలు, మూఢనమ్మకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. అనుమానం ఒక పెను భూతంలా మారుతుందని, మూఢనమ్మకాలను నమ్మకుండా శాస్త్రాన్ని మాత్రమే నమ్మాలని ఆయన పిలుపునిచ్చారు. మూఢనమ్మకాల వల్ల సమాజం అభివృద్ధికి దూరమవుతుందని, ధైర్యమే మనిషికి గొప్ప ఆస్తి అని గ్రామ సర్పంచ్ సారంపల్లి దేవేంద్ర మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డా. జి. రమేష్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామంలోని వీధులను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకుల నాయకులు ఉదయ్, వైస్ ప్రిన్సిపల్ మైసయ్య, ప్రవీణ్, యాదగిరి, రవి, రాజు, మున్ని, రమాదేవి, మంజుల, సలీం, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



