తాటి చెట్టు పై నుంచి పడి గీతా కార్మికునికి గాయాలు
On
విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన గీత కార్మికుడు డొనికెన పెద్ద నరసయ్య తాటి చెట్టు పై నుంచి పడి తీవ్ర గాయాలకు గురైనట్లు స్థానికులు తెలిపారు. యధావిధిగా బుధవారం ఉదయం తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దారి నుంచి వెళ్లే వారు చూసి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్లు చెప్పారు. కాగా 108 సిబ్బంది ఈ ఎం టి మల్లేష్,పైలట్ ప్రశాంత్ సమాచారం అందిన వెంటనే నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని డాక్టర్ సలహా మేరకు నరసయ్యకు ప్రధమ చికిత్స చేస్తూనే మానుకోటకు తరలించారు.



