ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు
విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ అంబేద్కర్ భవనంలో కిషన్ పుర లోని సిటీ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ఔరా 2026 ఫెస్ట్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళా డిగ్రీ కళాశాల డైరెక్టర్ చిట్టెటి రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులకు విద్య ప్రాముఖ్యతను వివరించి, సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల పట్ల తగు జాగ్రత్తలను విద్యార్థినిలకు సూచించారు. విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.ఈ సందర్భంగా విద్యార్థినిలు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని శిరీష హాజరై పాటలు పాడి ,విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అమరజ్యోతి,ఇంచార్జి నరేష్ అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



