గణిత శాస్త్రంలో పప్పుల అశోక్ కు పీహెచ్ డీ

గణిత శాస్త్రంలో పప్పుల అశోక్ కు పీహెచ్ డీ

విశ్వంభర, సంగారెడ్డి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి పప్పుల అశోక్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘హైబ్రిడ్ డీప్ లెర్నింగ్ నమూనాలను ఉపయోగించి క్రిప్టోకరెన్సీ ధర అంచనా: ఒక సమగ్ర తులనాత్మక కాల శ్రేణి విశ్లేషణ’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణాంక శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ అశోక్ సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడంపై గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర జాదవ్ గణేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించారు.

Tags: