ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే  ఇంటింటికి సిపిఐ

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే  ఇంటింటికి సిపిఐ

విశ్వంభర, డిండి: మండల కేంద్రంలో సిపిఐ ప్రజాభవన్ లో నిర్వహించిన డిండి మండల కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు  బుచ్చిరెడ్డి  మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ఇంటింటికి సిపిఐ అనే నినాదంతో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంతోందని చెప్పారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని  కోరారు. ఏప్రిల్ 1 నుండి ఇంటింటికి సిపిఐ ఉద్యమాలకు పోరాటాలకు చేయూతగా విరాళాలు ఇవ్వండి ఆదరించి పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలని రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకు సిపిఐ వెళ్తుందని ప్రజల సమస్యలే పరిష్కార ద్యేయంగా ఈ మహత్తర కార్యాన్ని తలపెట్టిందని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గడపగడపకు సిపిఐ వెళ్లాలని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేరకు సక్సెస్ కాలేకపోయింది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఒక్క ఫైల్ కూడా పరిష్కారం కాలేదని,  అధికారుల నిర్లక్ష్యమా లేక ప్రభుత్వ నిర్లక్ష్యమో  రైతులు ఈ విషయంలో ఆఫీసర్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పిర్తి విజేందర్ రెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు  ఎం డి మైనోద్దీన్,సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి,సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్, ఏ ఐ టి యు సి  జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు, ఏ ఐ వై ఎఫ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్, ఏ ఐ వై ఎఫ్  డివిజన్ అధ్యక్షులు వినయ్ కుమార్,సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శిలు వంకేశ్వరం చక్రి, దుబ్బ లక్ష్మారెడ్డి, బాబా, మధుసూదన్ రెడ్డి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Tags: