కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి 

  • : టి యుసి ఐ  డిమాండ్  

విశ్వంభర, మహబూబాబాద్ :  విద్యుత్  కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని  టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి , జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్ల కంటి సూర్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ కార్మికులకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని ఆర్డిజన్లుగా మారుస్తూ స్టాండింగ్ రూల్స్ రూపొందించడానికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు కాంట్రాక్టు కార్మికులు ఈనెల 8 నుండి సమ్మె చేస్తున్నారని చెప్పారు. ఈ సమ్మెకు ట్రేడ్ యూనియన్  ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) మహబూబాబాద్ జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నదని అన్నారు . రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల 23,000  వేల మంది సమ్మెలో దిగుతున్నటువంటి స్థితి ఉన్నది, వారి సమస్యలు పరిశీలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని, వేసవికాలంలో విద్యుత్తు డిమాండ్ ఎక్కువగా ఉంటది అని ఇలాంటి సమయంలో విద్యుత్ కార్మికులు సమ్మెకు దిగడం అనేది రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత అని ప్రజల పై తీవ్రంగా  ప్రభావం చూపుతున్నదని వారు అన్నారు.  కార్మికుల సమస్యల పట్ల  రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారిని రెగ్యులర్ పనిచేస్తున్నటువంటి కార్మికులకు వర్తింపజేసే విధంగా రూల్స్ ను అమలు చేయాలని వారు ఏదైతే న్యాయమైన డిమాండ్స్ పైన సమ్మె నిర్వహిస్తున్నారని, కార్మికుల డిమాండ్ అని  పరిష్కరించాలని లేనియెడల ఇతర రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని కూడా రోడ్లమీద తీసుకొచ్చి వారికి సంఘీభావంగా పోరాటాల నిర్వహిస్తామని హెచ్చరించారు . రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పాలకవర్గాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నారు.

Tags: