డాక్టర్ క్రాప విజయ్‌కు సన్మానం
విశ్వంభర, భద్రాచలం: సేవాభావం, నిబద్ధత, వైద్య నైపుణ్యాన్ని సమన్వయంతో ఆచరణలో బెట్టిన భద్రాచలానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ క్రాప విజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ఆయన అందిస్తున్న నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ నాయకత్వం డాక్టర్ విజయ్‌ను ఘనంగా సత్కరించింది. శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సన్మానించి ఆయన సేవలను కొనియాడింది. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ , డాక్టర్ క్రాప విజయ్ అందుకున్న ఈ గౌరవం ఆయన వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే కాకుండా మొత్తం భద్రాచలం ప్రాంతానికి గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో ఆయన సేవలు మరింత విస్తరించి, సమాజానికి ఇంకా ఎక్కువగా మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. అలాగే వైద్య రంగంలో సేవా భావం కలిగిన నిపుణులు సమాజానికి ఎంతో అవసరమని, అలాంటి వ్యక్తులను ప్రభుత్వం ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, భద్రాచలం ప్రాంతీయ కార్యాలయం కన్వీనర్ టీవీఎస్ ప్రసాద్, భద్రాచల మండల అధ్యక్షులు కొమరం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి.ఎస్.వి. ప్రసాద్ బాబు, ట్రెజరర్ ఆశలత, సైదులు, సీనియర్ నాయకులు రాజా శ్రీనివాస్, మండల బాధ్యులు జి. వెంకటేశ్వర్లు, తులసీరామ్ తదితరులు పాల్గొని డాక్టర్ విజయ్‌కు అభినందనలు తెలిపారు.



