గ్రామపంచాయతీ కాంప్లెక్స్ దుకాణాలు సీజ్

గ్రామపంచాయతీ కాంప్లెక్స్ దుకాణాలు సీజ్

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట పట్టణ కేంద్రంలో పాత బస్టాండ్ ఆవరణలో గల గ్రామపంచాయతీ కాంప్లెక్స్ మడిగలను బుధవారం గ్రామపంచాయతీ కార్యదర్శి సిబ్బంది సీజ్ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గ్రామ అభివృద్ధి అనేది గ్రామంలో చెల్లించే పన్నుల పైన ఆధారపడి ఉంటుందని తెలిపారు.గత మూడు నాలుగు సంవత్సరాలుగా కాంప్లెక్స్ షాపులకు ఎలాంటి కిరాయిలు చెల్లించకుండా దుకాణదారులు కాలం వెలదీస్తున్నారని ఇప్పటికీ మూడు,నాలుగు నెలల నుంచి మూడుసార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని అయినా కూడా దుకాణదారుల నుంచి ఎలాంటి స్పందన లేదని అందువల్లనే సీజ్ చేయాల్సి వచ్చిందని, ఇలా గ్రామపంచాయతీకి కిరాయిలు ఎగవేస్తూ ఉంటే గ్రామపంచాయతీ అభివృద్ధికి మరియు గ్రామ అభివృద్ధి పైన దీని ప్రభావం పడుతుందని తెలియజేశారు. రామన్నపేట ఏరియా ఆసుపత్రి ఆధీనంలో గల కాంప్లెక్స్ కు సంబంధించిన దుకాణదారులు కూడా చాలా కాలం నుంచి బకాయిలు పెండింగ్లో ఉన్నట్టుగా వినికిడి, దీనికి సంబంధించి అధికారులు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు

Tags: