10న ఆదివాసి సాంస్కృతిక సమ్మేళనం

10న ఆదివాసి సాంస్కృతిక సమ్మేళనం

విశ్వంభర, భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్‌లో ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఆదివాసి సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనం, కోయ ఇలవేల్పుల చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను పరిరక్షిస్తూ తదుపరి తరాలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. గిరిజన సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు వారి సంప్రదాయ విలువలను సమాజానికి పరిచయం చేయడం ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఆమెతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా ఉన్నతాధికారులు, ఐటిడిఏ అధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజన పెద్దలు మరియు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొననున్నారు.

Tags: