ఆర్టీసీ ఉద్యోగులకు సహజ మరణానికీ రూ.10 లక్షల బీమాఆర్టీసీ ఉద్యోగులకు సహజ మరణానికీ రూ.10 లక్షల బీమా
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. శాలరీ అకౌంట్ కలిగిన సిబ్బందికి ఇప్పటివరకు ప్రమాద మరణాలకు మాత్రమే వర్తిస్తున్న బీమా సౌకర్యాన్ని, ఇకపై సహజ మరణాలకు కూడా విస్తరించింది. ఈ పథకం ప్రకారం ఉద్యోగి సహజంగా మరణించిన సందర్భంలో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక భరోసా అందుతుంది. ఇందుకు ఉద్యోగులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా, పూర్తిగా బ్యాంకే భరిస్తోంది. ఈ నూతన విధానం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అమల్లో ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతుండగా, సహజ మరణ బీమా అదనంగా చేరడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల దాదాపు 38 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు మరింత భద్రత లభించనుంది. సంస్థ వీసీ, ఎండీ వై నాగిరెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.



