యువత అభివృద్ధిపై అవగాహన
On
విశ్వంభర,ఆత్మకూర : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ఆత్మకూరు గ్రామ పంచాయతీ ఆవరణలో సంఘ బంధం-2 వారితో నీడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లింగ సమానత్వం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. యువత అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంస్థ అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం కురుమ మాట్లాడుతూ, పురుషులు, మహిళలుఅందరికీ సమాన హక్కు, బాధ్యతలు, మహిళ సాధికారత, వ్యవసాయం, విద్యారంగాలపై అవగాహన కలిగి ఉండాలి అన్నారు. లింగ సమానత్వ సాధనలో మహిళల పాత్ర చాలా కీలకమన్నారు. విద్య, ఆరోగ్యం , ఇతర సామాజిక ఆర్థిక రంగాల్లో స్త్రీ పురుషులు సమాన అవకాశాలు పెంచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వీబీకే పాశం శ్యామల, పి జయశ్రీ, సరిత , మాధవి, లక్ష్మి, మంజుల, ఎన్ జ్యోతి, జె మంజుల, ఎన్ జ్యోతిలక్ష్మి, అండమ్మ, తదితరులు పాల్గొన్నారు.



