పోలీస్ కుటుంబాల సంక్షేమానాకి భరోసా 

పోలీస్ కుటుంబాల సంక్షేమానాకి భరోసా 

  •  ఎస్పీ నరసింహ 

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ లో  ఏఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ ఇటీవల అకాలంగా మృతి చెందాడు.  ఏఎస్ఐ సత్యనారాయణ కుటుంబానికి పోలీసు భద్రత స్కీం కింది నగదు చెక్కు ను  ఎస్పీ నరసింహ నరసింహ జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేసినారు. పోలీసు శాఖలో పని చేస్తూ ఆకాలంగా ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను పోలీసు శాఖ అన్ని విధాలుగా అదుకుంటుందని, దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుంది అన్నారు. సత్యనారాయణ కుటుంభం యొక్క సంక్షేమానికి కృషి చేస్తామని యస్.పి తెలిపినారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, పోలీసు సంఘం అధ్యక్షులు ఎస్ ఐ  రామచందర్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.

Tags: