155 మందికి డబుల్ బెడ్‌రూమ్ పట్టాలు
On
విశ్వంభర, సికింద్రాబాదు : సికింద్రాబాదు కంటోన్మెంట్ నియోజకవర్గంలో 155 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టాలు అందజేశారు. మారేడుపల్లి, ఓల్డ్ మారేడుపల్లి, సాయి చరణ్ కాలనీ, కట్టమైసమ్మ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు ఈ పంపిణీకి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్, మాజీ కార్పొరేటర్ దీపిక తదితరులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్హులందరికీ ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు, స్థలం లేని వారికి బహుళ అంతస్తుల్లో గృహాల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.



