వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

  •  ఎస్పీ నర్సింహా

 విశ్వంభర, సూర్యాపేట: మంగళవారం రాత్రి సమయంలో చివ్వెంల మండల పరిధి జాతీయ రహదారి 65పై వల్లభాపురం గ్రామ శివారులో ఎచర్లముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన డీసీఎం, టాటా ఎసి వాహనాల రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ నర్సింహా పరిశీలించారు. ప్రమాదం జరగటానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహన సామర్థ్యానికి మంచి ప్రయాణికుల రవాణా, అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో అనేక ప్రజా అవగాహన సదస్సులు నిర్వహించి రోడ్డు ప్రమాదాల పట్ల విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వాహనదారులు నియమ నిబంధనలను పాటించకపోవడం అతివేగంగా వాహనాలు నడుపుతూ, రోడ్లపై పరిస్థితులను అంచనా వేయక, ముందు వెనక వాహనాలను గమనించక ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలను నివేదిక తయారు చేయాలని రోడ్డు సంబంధిత లోపాలు ఉంటే సంబంధిత అధికారులకు నివేదించాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు. ప్రయాణ సమయంలో వాహన అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలని రోడ్లపై ఉన్న ప్రమాదాలను, అడ్డంకులను గమనించాలని అన్నారు, సీటు బెల్టు పెట్టుకోవడం, నిదానంగా వాహనాలు నడపడం, ముందు వెనకాల ఉన్న వాహనాలను గమనిస్తుండడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అనంతరం స్థానికులతో మాట్లాడి రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించారు. ప్రమాదం తీరుపై అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు. ఎస్పీ వెంట సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, స్థానిక ఎస్సై రత్నం ఉన్నారు.

Tags: