ప్రైవేట్ బడి వద్దు..  ప్రభుత్వ బడి ముద్దు

  •  రాపెళ్లికోటలో బడిబాట కార్యక్రమం 
       

విశ్వంభర, మహాదేవపూర్:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం రాపల్లి కోట గ్రామంలో  ప్రాథమిక పాఠశాల లో సర్పంచ్ కళ్ళ గట్టయ్య , ఉపాధ్యాయులు జాస్మిన్ , మమత , కార్యదర్శి ప్రసాద్   ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈసారి అకాడమిక్ ఇయర్ ఎక్కువ అడ్మిషన్ రావాలి , గ్రామంలో ఉన్న 1-5 విద్యార్థులు గ్రామ ప్రభుత్వం పాఠశాలలోనే చదవాలి , ఒక్క ప్రైవేట్ బస్ అనేది మన గ్రామానికి రావద్దు  అని వారు మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన పేదల ప్రభుత్వం , మన లాంటి పేదల బిడ్డల కోసం ప్రతి ప్రభుత్వ పాఠశాల పిల్లలకి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటేనే పిల్లలు చదువులో రాణిస్తారు. అని ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు  చేయడం జరుగుతుంది. యూనిఫామ్, బెల్ట్, షూస్, ఉదయం అన్ని రకాల టిఫిన్స్, పాలు, రాగిజావ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, అన్ని రకాల కార్యకలాపాలతో  కూడుకున్నది  మన ప్రభుత్వ బడి అని అన్నారు. తల్లితండ్రులు ఆలోచన చేయండి  అనవసరంగా కష్టం చేసి సంపాదించినా డబ్బులు పిల్లలను ప్రైవేట్ బడిలో చేర్పించి ఆర్థికంగా వెనకపడకండి, ప్రైవేట్ బడి లో పిల్లలు చాలా మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని అన్నారు.

Tags: