ఉద్యమకారులకు తెలంగాణ హైకోర్టు శుభవార్త  

ఉద్యమకారులకు తెలంగాణ హైకోర్టు శుభవార్త  

  విశ్వంభర, రామన్నపేట: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో ఉద్యమకారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యమ జేఏసీ నాయకులు తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున, ఉద్యమకారుల తరుపున హైకోర్టు న్యాయవాది జి.కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం అభయహస్తం పథకం కింద అప్లై చేసుకున్న ఉద్యమకారులకు ఎనిమిది వారాలలో ఇండ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలంటూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఫ్రీడమ్ ఫైటర్ శాఖకు హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ హైకోర్టు ఆదేశాల పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఉద్యమకారుల సంఘం హర్షం తెలిపారు.

Tags: