బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఘన సన్మానం - శుభాకాంక్షలు తెలిపిన వేదాల శ్రీనివాస్
విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బ్రాహ్మణ సంఘాల కలయికతో ఏర్పడిన బ్రాహ్మన్స్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడ లోని వసంత్ విహార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజాపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నారపరాజు రామ్ చందర్ రావు కు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్లైర్ వాయoట్,సినీ ప్రొడ్యూసర్,మార్చంట్ ఎక్స్పోటర్ మరియు శ్రీ మందిరం ప్రొడక్షన్స్ అలాగే శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ అధినేత వేదాల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా ఎన్ రామచందర్ రావు ని కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేదాల శ్రీనివాస్ మాట్లాడుతూ 40ఏళ్ల సుధీర రాజకీయలో క్రియాశీలకంగా కష్టపడి ఈ స్థాయికి రావడం గర్వకారణం అన్నారు, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో అతనికి ఆత్మీయ సత్కారం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం, మాజీ మైనింగ్ ఎండి సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



