విష్ణువర్ధన్ రెడ్డి కి ఘనంగా నివాళి
విశ్వంభర, మేడ్చల్: మేడ్చల్ పట్టణానికి చెందిన నా రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్-మల్కాజిగిరి మాజీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ పర్సన్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విష్ణువర్ధన్ రెడ్డి సేవలను స్మరించుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బాల్ రెడ్డి, గువ్వా నరేంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.