నెల్లికుదురు పీహెచ్సీ ని 30 పడగలకు అప్ గ్రేడ్ చేయాలి
- సిపిఎం జిల్లా నేత రాజన్న
విశ్వంభర, నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలకు పెంచాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గునిగంటి రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సమస్యలపై సర్వేలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు బుధవారం సందర్శించి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో డయాలసిస్ బాధితులు ఎక్కువగా ఉన్నారని వీరు దూర ప్రయాణం చేసి చికిత్స పొందడం ఇబ్బందిగా ఉందన్నారు. సంబంధిత బాధితుల ప్రయోజనం కోసం డయాలసిస్ చేయడానికి నెల్లికుదురు పీహెచ్సి లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కేవలం రెండు పడకలతో 1970 లో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి రెండునుంచి ఆరు పడకల వరకు అభివృద్ధి చేయటం జరిగిందని 16 రెవెన్యూ గ్రామాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించడానికి ఈ సౌకర్యం ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు.చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న డాక్టర్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని,కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించాలని,ల్యాబ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా సిపిఎం నాయకులు బెల్లం అశోక్ మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు,పెరుమాండ్ల బాబు గౌడు,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.