మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి: జాన్ వెస్లీ
విశ్వంభర, ఖైరతాబాద్ : జనగణన, డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. హైదరాబాదు గన్‌పార్క్ వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ చట్టం అమలును జనగణన, డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం సరికాదన్నారు. మహిళల ఉద్యమానికి సీపీఎం పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో: ఆర్. అరుణ జ్యోతి, హేమలత, పి. శశికళ, కేఎన్ ఆశాలత, కే. నాగలక్ష్మి, ఎం. వినోద, వై. వరలక్ష్మి, ప్రీతి, ఎండి షబానా బేగం, ఆర్. లక్ష్మీదేవి, భారతి, కవిత పాల్గొన్నారు.