శుక్రవారం విద్యాసంస్థల బంద్

శుక్రవారం విద్యాసంస్థల బంద్

విశ్వంభర, హైదరాబాదు  : నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలకు నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక (ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ) శుక్రవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా  బంద్‌కు పిలుపునిచ్చింది. హైదరాబాదులో జరిగిన విలేకరుల సమావేశంలో టి. నాగరాజు, కె. మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, వెంకట్ స్వామి, పల్లె మురళి మాట్లాడుతూ ఎన్‌టీఏను రద్దు చేయాలని, ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపించాలని, వీబీఎస్‌ఏ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను విజయవంతం చేయాలని  ప్రజలకు పిలుపునిచ్చారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bandh-of-educational-institutions-on-friday/article-19430

Tags: