గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ల పంపిణీ
విశ్వంభర, గచ్చిబౌలి : హైదరాబాదు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు కరాటే ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు శివరాంపల్లిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. డిప్యూటీ డైరెక్టర్ (టీఏసీ) ఐపీఎస్ కల్మేశ్వర్ షింగేనవర్ ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. నవీన్ నాయక్ కరాటే అకాడమీకి చెందిన నిగ్న సింహారెడ్డి, యశ్విత, చందన, దినేశ్వర్ గిన్నిస్ రికార్డులో భాగస్వాములై సత్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా కల్మేశ్వర్ షింగేనవర్ మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ, ప్రతిభను అభినందించారు. రామంతపూర్‌లోని కామాక్షిపురం ప్లేగ్రౌండ్‌లో ఉచితంగా కరాటే శిక్షణ అందిస్తున్న కోచ్ నవీన్ నాయక్ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లచిరాం నాయక్, కోచ్ నవీన్ నాయక్, నిగ్న సింహారెడ్డి, యశ్విత, చందన, దినేశ్వర్ పాల్గొన్నారు.