విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా మోదీ దిష్టిబొమ్మ దహనం
విశ్వంభర, మహేశ్వరం: ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద శాంతియుత నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం, విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ఖండనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కున యాదయ్య, మాజీ మండల అధ్యక్షుడు కాకి ఈశ్వర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, సర్పంచులు రాజు నాయక్, చేపంగి ప్రవీణ్, ఉపసర్పంచులు మంత్రి అంజయ్య, భాస్కర్ నాయక్, సంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.