నేరడ మోడల్ స్కూల్‌కు నీటి మోటార్ విరాళం

నేరడ మోడల్ స్కూల్‌కు నీటి మోటార్ విరాళం

  • విద్యార్థిని లాస్య కుటుంబం సేవాభావానికి ప్రశంసలు

విశ్వంభర, కురవి : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలకు సుమారు రూ.8 వేల విలువైన 1 హెచ్‌పీ నీటి మోటారును 8వ తరగతి విద్యార్థిని గుగులోతు లాస్య, ఆమె తల్లిదండ్రులు గుగులోతు భాగ్యలక్ష్మి, రాజేందర్ తమ కుటుంబ సభ్యురాలు గుగులోతు వసంత జ్ఞాపకార్థం బుధవారం విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మోటారును ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంత్, వైస్ ప్రిన్సిపాల్ అరుణశ్రీ, వార్డెన్ రజితకు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ...విద్యార్థిని లాస్యతో పాటు ఆమె తల్లిదండ్రులు సమాజానికి ఆదర్శంగా నిలిచే సేవాభావాన్ని చాటారని కొనియాడారు. పాఠశాల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేసిన ఈ విరాళం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మసోత్ శంకర్, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయ బృందం, పీడీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/donation-of-water-motor-to-nerada-model-school/article-19416

Tags: