ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ధర్నా

ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ధర్నా

విశ్వంభర, కమాన్ పూర్:  ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఆరోగ్య కేంద్రం ముందు ప్రధాన రహదారి పై ధర్నా - రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా - రాస్తారోకో చేస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులను ధర్నా - రాస్తారోకో కార్యక్రమాన్ని  విరామింపజేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కమాన్ పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో స్టాఫ్ నర్సులు లేరని, అన్ని రకాల మందులు సరిపడా లేవని, ఆసుపత్రి ఆవరణలోని క్వార్టర్లు శితిలావస్థలో ఉన్నాయని ఆరోపించారు. అలాగే కమాన్ పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా ఆఫగ్రేడ్ చేయాలని, ఆసుపత్రి ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు తాటికొండ శంకర్, యూత్ మండల మాజీ అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్,మాజీ జడ్పిటీసీ మేకల సంపత్ యాదవ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, నాయకులు గాదె సదయ్య,రాచకొండ రవి, దండే కిషన్, బోయిని బాలకృష్ణ, ఎలాబోయిన రామ్మూర్తి, తోట రాజు కుమార్, పెండ్లి నారాయణ, పంతకానీ రవి, భూపెల్లి మల్లేష్, కొయ్యడ రవిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

శ్రీ లక్ష్మనేశ్వర  స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 
ఒకరికి ఒకే ఓటు.. అనర్హుల పేర్లకు చోటు లేదు!,-డా. వైభవ్ రెడ్డి
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పడమటి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, గుత్తి రాఘవేందర్
సన్ షైన్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా.. షాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 
ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026