రవీంద్రభారతి పాఠశాలలో ఘనంగా విద్యార్థుల నాయకత్వ ప్రమాణ స్వీకారం
విశ్వంభర, హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ లోని రవీంద్రభారతి పాఠశాలలో విద్యార్థుల నాయకత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రవాణా శాఖ ఏసీపీ రఘుపాల రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన విద్యార్థి నాయకులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా ప్రత్యేక బ్యాడ్జీలను అలంకరించి, వారి బాధ్యతలను గుర్తుచేస్తూ శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం ఏసీపీ రఘుపాల రామ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రతి విద్యార్థి ప్రాథమిక స్థాయి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి పాఠశాల దశ నుంచే క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఆయన హితవు పలికారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్, వీరయ్య, ప్రిన్సిపాల్ లావణ్, డి.ఓ నిశాంత్ తో పాటు ఇతర ఉపాధ్యాయ బృందం, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.