గాంధీ భవన్ ముట్టడికి యత్నం.. బీజేపీ రాంచందర్ రావు అరెస్ట్

విశ్వంభర, హైదరాబాదు : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసనకు నిరసనగా బీజేపీ రాష్ట్ర శాఖ బుధవారం గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకెల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ వైపు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకుని రాంచందర్ రావు, దీపక్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని తరలించారు. ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ పార్లమెంట్‌లో చర్చలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్, రాహుల్ గాంధీ రాజకీయ నిరసనలకు దిగడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. దేశాన్ని అస్థిరపరిచే రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. దేశవ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని, అరెస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు. బిజెపి సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకెల దీపక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం నిరసనలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, యువమోర్చా, వివిధ మోర్చాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjps-ramchander-rao-arrested-for-attempting-to-attack-gandhi-bhavan/article-19460

Tags: