శంషాబాద్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన.. ఢిల్లీ ఘటనపై నిరసన
- జంతర్ మంతర్ ఘటనను ఖండిస్తూ విద్యార్థుల ర్యాలీ.. శంషాబాద్‌లో ఉద్రిక్తత.
- నీట్ అంశంపై శంషాబాద్‌లో నిరసన.. విద్యార్థి నాయకుల అరెస్ట్.
Shamshabad Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష అంశంపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడిని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దాదాపు వెయ్యి మంది విద్యార్థులు, వివిధ కళాశాలల విద్యార్థి సంఘాలు, యువజన నాయకులు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, విద్యార్థులపై దాడి చేయడం సరికాదని ఆందోళనకారులు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశంపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.