తెలంగాణలో ఆర్‌పీఐని బలోపేతం చేస్తాం: పశులా రవికుమార్

విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆర్‌పీఐ (అథవాలే) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పశులా రవికుమార్ అన్నారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాందాస్ అథవాలే తనను మరోసారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి సంస్థాగతంగా పార్టీని విస్తరిస్తామని తెలిపారు. యువత, మహిళలు, కార్మికులు, దళితులు, వెనుకబడిన వర్గాలను పార్టీతో అనుసంధానం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ పేరుతో కొందరు అనధికారికంగా నిధులు సేకరిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, అలాంటి చర్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు. కార్యకర్తలు అధికారిక పార్టీ నాయకత్వంతోనే సంబంధాలు కొనసాగించాలని, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్‌పీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పీటర్ నాయుడు, స్నేహలత, మాస్టర్ జి, సాంబ, రాములు, దేవయ్య, రాంకుమార్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rpi-will-be-strengthened-in-telangana-pashula-ravikumar/article-19446

Tags: