బీజేపీ తో పౌర ప్రాథమిక హక్కులకు భంగం : కె ఎల్ ఆర్
* రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్ పై ఆగ్రహం
* యువత శాంతియుత నిరసనలకు కాంగ్రెస్ మద్దతు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ పై శాంతియుత నిరసనలు చేపట్టిన యువతపై నిరంకుశంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించటంపై మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, యువత ప్రాథమిక హక్కులను అణిచివేసేందుకు బీజేపీ కేంద్ర సర్కార్, ప్రధాని మోడీ సర్కార్ కుట్రలు చేస్తుందని కె.ఎల్.ఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, విద్యార్థులు యువత న్యాయమైన డిమాండ్లనుపరిష్కారించాలని కిచ్చెన్న కోరారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సహా ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీస్ లాఠీలు ఝులిపించి. కేసులతో వారి భవిష్యత్ తో ఆటలు ఆడుకుంటుందని కేంద్రంపై కేఎల్ఆర్ మండిపడ్డారు. బీజేపీ పక్షపాత దోరణి, జవాబుదారి తనాన్ని మరిచి మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని కే ఎల్ ఆర్ ఆరోపించారు,మహేశ్వరం అసెంబ్లీ సహా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర వైఖరిని నిరసిస్తూ,శాంతియుత ఆందోళనలకు దిగిన విషయాన్ని గుర్తు చేశారు.