గోపాలపురం కాలనీలో ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమం
ప్రజల భద్రతకు పోలీసులు అండగా ఉంటారు: జిల్లా ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమంలో భాగంగా గోపాలపురం కాలనీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల వద్దకే పోలీసు సేవలను తీసుకెళ్లి భద్రతపై భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. మహిళలు, బాలల రక్షణకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో ‘పోలీస్ అక్క’ సేవలు అందుబాటులో ఉన్నాయని, వృద్ధుల భద్రత కోసం సీనియర్ సిటిజన్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, జిల్లా కేంద్రంలో 600 సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. సైబర్ మోసాలు, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత, సోషల్ మీడియా వినియోగం, సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచితులకు వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఇవ్వొద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా షీటీమ్ సభ్యులు, పోలీస్ కళాబృందం ఆటపాటల ద్వారా మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, పోలీసు సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, 36వ వార్డు కౌన్సిలర్ మన్సూర్ బి. ఫారూక్, ఎస్‌ఐలు యాదవేందర్ రెడ్డి, కనకరత్నం, షీటీమ్ ఎస్‌ఐ నీలిమ, పోలీసు సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు