టీడీపీ ప్రజాపథంలో ప్రజా సమస్యలపై వినతులు

విశ్వంభర, సనత్‌నగర్ :  సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో చేపట్టిన 'తెలుగుదేశం–ప్రజాపథం' కార్యక్రమం బుధవారం సనత్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తులసినగర్ బస్తీల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలు, దెబ్బతిన్న రహదారులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు నాయకులకు వివరించారు. మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల జారీని వెంటనే ప్రారంభించి, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పార్టీ పోరాడుతుందని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టి, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి సతీష్, మల్లేష్, బి. శ్రీనివాస్ (గిర్ని సీను), పి. బాలరాజ్ గౌడ్, పి. అశోక్, జి.వి.జి. నాయుడు, వల్లారపు శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/appeals-on-public-issues-in-the-tdp-prajapatha/article-19462

Tags: