మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం పున్న జగన్మోహన్ మాట్లాడుతూ, ఢిల్లీలో విద్యార్థులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడి చేయడం ద్వారా వేలాది మంది విద్యార్థులు గాయపడిన సంఘటన చూసి ప్రధాన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ అధినేత చలో పిఎం హౌస్ నిరసన కార్యక్రమానికి పిలుపు నివ్వగా, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాధానం చెప్పలేక, అటు విద్యార్థుల పైన దాడికి సమాధానం చెప్పలేక, కుట్ర పూరితంగా రాహుల్ గాంధీపై దాడి చేయడం పిరికి పందల చర్య అని, రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసం రక్తం చిందించడం, వారి కుటుంబమే ఒక చరిత్ర అని, గాంధీ నుంచి నేడు రాహుల్ గాంధీ వరకు ఈ దేశం కోసం అందరూ రక్తం చిందించినవారని తెలుపుతూ, విద్యార్థులపై దాడికి నిరసనగా ప్రధానమంత్రి మోడీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, రామన్నపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జమీరుద్దీన్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కొత్తపల్లి అబ్రహం కుమార్, ఉప-సర్పంచ్ మోటే రమేష్, జినుకల ప్రభాకర్, సాల్వేర్ అశోక్, వనం చంద్రశేఖర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.