ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జి బాధాకరం
నీట్ పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: గూగులోత్ కిషన్ నాయక్
విశ్వంభర, మహబూబాబాద్: నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దళిత, గిరిజన ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని కోర్టు ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గూగులోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ, వరుసగా పరీక్ష పత్రాల లీకేజీల కారణంగా కష్టపడి చదివే విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మహిళా విద్యార్థులపైనా బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు పోలేపాక వెంకన్న, డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జం ఐలేష్, మాల మహానాడు రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు పడిశాల వెంకన్న, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు చేపూరి గణేష్, యాదవ సంఘం జిల్లా నాయకుడు తేజావత్ వినయ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకుడు మహంకాళి ఉపేందర్, సతీష్, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.