బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు

  • మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

విశ్వంభర, రామగిరి: బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడితే సహించేది లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హెచ్చరించారు. బుధవారం రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు పూదరి సత్యనారాయణ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు నమోదు చేసి నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. నాగేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పూదరి సత్యనారాయణ గౌడ్‌పై నమోదు చేసిన కేసు పూర్తిగా అక్రమమని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టారని అన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలు ఎంతమాత్రం సమంజసం కాదని, వెంటనే పూదరి సత్యనారాయణ గౌడ్‌పై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని పూదరి సత్యనారాయణ గౌడ్‌కు సంఘీభావం తెలిపారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/illegal-cases-against-brs-leaders-will-not-be-tolerated/article-19468

Tags: