మడిపల్లిలో విషాద ఘటన.. పాము కాటుతో 25 ఏళ్ల యువకుడు మృతి

  • తొర్రూరు మండలంలో పాము కాటుతో యువకుడు మృతి.
  • మడిపల్లి శివారు సోమవరపుకుంట తండాకు చెందిన బానోత్ ప్రవీణ్ (25) మృతుడు.
  • పాము కాటుకు గురైన తర్వాత చికిత్సను నిర్లక్ష్యం చేసిన యువకుడు.
  • పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి.

Mahabubabad News: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి శివారు సోమవరపుకుంట తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోత్ ప్రవీణ్ (25) పాము కాటుతో గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం ఇంటి ముందు రేకుల షెడ్‌లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో కట్ల పాము కాటు వేసింది. వెంటనే లేచిన ప్రవీణ్ కాటు వేసిన పామును చంపేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించినప్పటికీ, తనకు ఏమీ కాదని నిర్లక్ష్యం చేశాడు. అనంతరం రాత్రి ఒంటిగంట సమయంలో వాంతులు, విరోచనాలు కావడంతో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ప్రవీణ్‌కు తల్లి రంగమ్మ, భార్య మమత, ఐదుగురు అక్కలు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-tragic-incident-in-madipally-a-25-year-old-youth-died-of/article-19499

Tags: