26వ వార్డులో ఉచిత వైద్య శిబిరం
- సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు: కౌన్సిలర్ మాలోతు శ్రీదేవి బాలునాయక్
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ 26వ వార్డులోని సిగ్నల్ కాలనీలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 26వ వార్డు కౌన్సిలర్ మాలోతు శ్రీదేవి బాలునాయక్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని మైత్రి హాస్పిటల్ యాజమాన్యం, ప్రముఖ వైద్యుడు డాక్టర్ బాలు నాయక్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీదేవి బాలునాయక్ మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన ఈ శిబిరంలో పలువురు నిపుణులైన వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరాన్ని పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు వినియోగించుకున్నారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన మైత్రి హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి, సిబ్బందికి 26వ వార్డు ప్రజల తరఫున కౌన్సిలర్ శ్రీదేవి బాలునాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగార్జున రెడ్డి, ఇతర వైద్యులు, వార్డు ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.