డీజీపీ కార్యాలయంలో కలకలం.. సూసైడ్ నోట్ రాసి కానిస్టేబుల్ ఆత్మహత్య

  • హైదరాబాద్లో విషాదం.. డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.
  • సర్వీస్ తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి బలవన్మరణం.

Hyderabad DGP Office: హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి గురువారం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో వాష్‌రూమ్‌లో తన సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు సమాచారం. అందులో తన భార్య, పిల్లలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని, వారు మంచివారని, తాను చనిపోయినా దయ్యమై అయినా వారిని చూసుకుంటానని రాసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/constable-committed-suicide-by-writing-suicide-note-in-dgp-office/article-19503

Tags: