రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన గూడూరు శ్రీనివాస్

విశ్వంభర, హైదరాబాదు : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ ఖండించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగబద్ధ హక్కులకు విరుద్ధమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కివేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. నీట్ పరీక్షల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ చేపట్టే శాంతియుత ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందని గూడూరు శ్రీనివాస్ తెలిపారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/guduru-srinivas-condemns-rahul-gandhis-arrest/article-19426

Tags: