మహబూబాబాద్‌లో విషాదం.. గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి
- మహబూబాబాద్‌లో గుండెపోటుతో ఉపాధ్యాయురాలు వజ్రకుమారి మృతి.
- సీరోల్ మండలం చింతపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత స్కూల్ అసిస్టెంట్‌గా విధులు.
- రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సమయంలో గుండెపోటు.
- ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల నిర్ధారణ.
Mahabubabad News: మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సీరోల్ మండలం చింతపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వజ్రకుమారి (45) గుండెపోటుతో మృతిచెందారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు గురువారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వజ్రకుమారి ఆకస్మిక మరణంతో విద్యాశాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతికి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.