రాజీనామా చేసేంతవరకు పోరాటం ఆపొద్దు
విశ్వంభర, నెల్లికుదురు: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు పోరాటం ఆపొద్దని పి వై ఎల్ నేత ఇరుగు అనిల్ విద్యార్థి సంఘాలకు ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ పార్లమెంటు వద్ద నిరసన తెలపడానికి బయలుదేరిన విద్యార్థులపై లాఠీ ఛార్జిని వ్యతిరేకిస్తూ పిడిఎస్యు,పి వై ఎల్ మండల కేంద్రం నెల్లికుదురు లో బుధవారం నిరసన తెలిపింది. ఈసందర్భంగా అనిల్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుని నీట్ పరీక్ష రాద్దామనే సమయానికి లీక్ అవడంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యుడైన కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎల్ పిడి ఎస్ యు నాయకులు శివ,స్టాలిన్,కల్తి ప్రమోద్,ముక్తి జనార్ధన్,చైతన్య తదితరులు పాల్గొన్నారు.