మహాకవి దాశరథి జయంతి సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపన్యాస కార్యక్రమం 

విశ్వంభర, రామన్నపేట: మహాకవి దాశరథి జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక డిగ్రీ కళాశాలలోని తెలుగుశాఖ ఆధ్వర్యంలో "దాశరథి సాహిత్యం- సందేశం" అనే  అంశంపై విస్తృత ఉపన్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ ఆర్.రత్నమంజుల మాట్లాడుతూ, దాశరథి తెలంగాణ సాయుధ పోరాటంలో తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచిన గొప్ప కవి అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధిపతి డాక్టర్ మహమ్మద్ హసేన్ మాట్లాడుతూ, దాశరథి తన జీవితాన్ని తెలంగాణ సమాజం కోసం అంకితం చేసిన మహనీయుడని, అద్భుతంగా రచనలు చేయడమే కాకుండా స్వయంగా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన యోధుడని అన్నారు. కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ, తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని నిజాం నిరంకుశత్వం మీద తిరుగుబాటు చేసిన వీరుడని, అణగారిన, పీడిత, తాడిత జనులను  ఉద్ధరించడం కోసం కవిత్వం రాసిన ప్రజాకవియని, అటువంటి మహనీయుని నుండి ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్నబాబు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు అద్దంకి ఆంజనేయులు, డాక్టర్ జి.సునీత డాక్టర్ సిహెచ్.వెంకట్ గౌడ్, డాక్టర్ డి.కిషన్, డాక్టర్ ఎం.రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, జె.నరేశ్ తదితర అధ్యాపకులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/lecture-program-in-government-degree-college-on-the-occasion-of/article-19480

Tags: