బీఎల్‌ఏలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు వివరాలు సేకరించాలి: కేఎల్‌ఆర్
విశ్వంభర, మహేశ్వరం: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ఆగస్టు 3 వరకు పూర్తి స్థాయిలో పనిచేయాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్) సూచించారు. తుక్కుగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 542 బూత్‌లలో పనిచేస్తున్న బీఎల్‌ఏలు, వారి బృందాలు, బూత్ ఇన్‌చార్జులు, డివిజన్ అధ్యక్షులు, అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు సమన్వయంతో పనిచేసి అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందాలంటే ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలని, నిజమైన ఓట్లు గల్లంతు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీఎల్‌ఏలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించాలని, మరణించిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లు, నకిలీ ఓట్లను గుర్తించి అధికారులకు తెలియజేయాలని కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసేందుకు పార్టీ శ్రేణులు, బీఎల్‌ఏలు, బీఎల్‌వోలకు సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు లక్ష్మారెడ్డి సూచించారు.