రాహుల్ అరెస్ట్ ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణుల నిరసన
విశ్వంభర, నెల్లికుదురు: నీట్ పరీక్ష లీకేజీ పట్ల విద్యార్థుల శాంతియుత ప్రదర్శన పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం ముందు నిరసన తెలిపిన రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నెల్లికుదురు మండలం కాంగ్రెస్ శ్రేణులు స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, హెచ్ వెంకటేశ్వర్లు, గుగులోతు బాలాజీ నాయక్,పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ మాట్లాడుతూ ఏ నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ నిర్వహించాలని కోరారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ లు మాదరి ప్రశాంత్,గుగులోత్ విరన్న నాయక్,ఉప సర్పంచి లు వెంకన్న,సాంబమూర్తి,నాయకులు రత్నాపురం యాకయ్య, ఉపసర్పంచ్లు వెంకన్న,కొప్పు శ్రీను, మౌలానా, నర్సయ్య, మధుసూదన్ రెడ్డి,అజ్జు, బండారి మల్లయ్య, ఆకుల కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి, బొమ్మిడి వెంకట్ రెడ్డి, బిరెల్లి బాబు, గుగులోతు సురేష్, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.