రూ.56 కోట్ల విద్యుత్ అభివృద్ధి పనులకు శ్రీకారం

  • రాష్ట్రంలో పవర్ కట్ అనేదే లేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విశ్వంభర, హనుమకొండ: రాష్ట్రంలో రూ.56 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ విద్యుత్ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం హనుమకొండలో శ్రీకారం చుట్టారు. టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, నూతన కార్యాలయ భవనాలు, కార్పొరేట్ మౌలిక వసతుల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, కొత్తగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రం, అత్యాధునిక సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, వర్షాభావం, జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గుదల వంటి సవాళ్లను అధిగమించి రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా మాత్రమే తాత్కాలిక అంతరాయాలు ఏర్పడతాయని, వాటిని పవర్ కట్లుగా భావించవద్దని స్పష్టం చేశారు. విద్యుత్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు దేశంలోనే తొలిసారిగా 1912 హెల్ప్‌లైన్‌కు అనుసంధానించిన 'ఎలక్ట్రిసిటీ అంబులెన్స్' సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో టీజీఎన్‌పీడీసీఎల్ అధికారులు గత రెండున్నరేళ్లలో కొత్త ఉపకేంద్రాలు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు లక్షలాది కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన వివరాలను వెల్లడించారు. గృహజ్యోతి పథకం కింద 53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుండగా, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, టీజీఎన్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rs-56-crore-power-development-works-initiated/article-19466

Tags: