చేనేత జౌళి శాఖ ఏడీని కలిసిన రామన్నపేట చేనేత సంఘం 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రానికి చెందిన టెరికాటన్ చేనేత సహకార సంఘం నూతన పాలక వర్గం, యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.శ్రీనివాస్ రావును వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో సంఘం అభివృద్ధి, చేనేత కార్మికుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు స్పందించిన ఏడీ శ్రీనివాస్ రావు చేనేత కార్మికుల సంక్షేమానికి, సంఘ అభివృద్ధికి తమ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెర్రి కాటన్ చేనేత సంఘం అధ్యక్షులు పెండం వేణుకుమార్, ఉపాధ్యక్షులు వనం నరసింహ, కార్యదర్శి దొంత నాగరాజు, డైరెక్టర్లు పెండెం భావనా ఋషి, వనం సత్య నారాయణ, బోడ యాదగిరి, అప్పం సంతోష్, గంజి సువర్ణ, అశోక్, సూరేపల్లి లావణ్య, జగన్మోహన్, పెండెం లక్ష్మి, పున్న భరత్ తదితరులు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ramannapet-handloom-association-met-ad-of-handloom-textile-department/article-19434

Tags: